విశాఖ: సామాజిక భవనం ప్రారంభం

విశాఖపట్నంలోని 27వ వార్డు, హిందూ ముస్లిం కాలనీలో 47.90 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. ప్రజా అవసరాల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేల చేతుల మీదుగా స్థానిక లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్