విశాఖలోని ఎం.వి.పి రైతుబజార్‌ను మార్కెటింగ్ డైరెక్టర్లు శోభ, తాతారావు గురువారం సందర్శించారు. వారు ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజార్ మొత్తాన్ని కలియదిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు విక్రయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.