విశాఖలో ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గాలమ్మకు విశేష పూజలు నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం పూర్ణామార్కెట్ సమీపంలోని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, వార్డు సెక్రటరీ మంగరాజు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. శేఖర్ బాబు ఈ పూజల్లో పాల్గొన్నారు.