విశాఖలోని సృష్టి సెంటర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మేనేజర్ కల్యాణి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. అక్రమ సొమ్ములో కల్యాణికి డాక్టర్ నమ్రత వాటా ఇచ్చినట్లు తెలుస్తోంది. నమ్రత కల్యాణికి విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చిందని సమాచారం. 2012 నుంచి సృష్టిలో పని చేస్తున్న కల్యాణి, రాజస్థాన్ దంపతులకు శిశువును అప్పగించి, రూ.2 లక్షలు తీసుకుందని తెలుస్తోంది.