విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం: మరో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు గోకివాడ సూరిబాబు శనివారం మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్లాంట్‌లో వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో తోటి కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంతో కర్మాగారంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్