విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందించిన తరహాలోనే, ప్రస్తుత స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు రూ. కోటి పరిహారం ప్రకటించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తమ ప్రభుత్వం గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎంఎన్సీ కంపెనీ ప్రతినిధులను జైలుకు పంపిందని, చరిత్రలో ఎక్కడా లేని విధంగా బాధితులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు.