విశాఖ: బీచ్‌లలో మద్యం విక్రయాల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి

విశాఖ సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చే ప్రభుత్వ "బీచ్ షాక్" నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద నిరసన ర్యాలీ జరిగింది. గోవా కల్చర్ పేరుతో బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతులివ్వడం దుర్మార్గమని, దీనివల్ల మహిళల రక్షణకు భంగం వాటిల్లుతుందని, పర్యావరణం ధ్వంసమవుతుందని ఐద్వా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్