గిరి ప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. హనుమంతవాక జంక్షన్ నుంచి ఈ సమస్య ఏర్పడింది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడానికి భక్తులు వాహనాల మధ్య నడవడం ఒక కారణమని చెబుతున్నారు. మూడున్నర గంటల తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో ట్రాఫిక్ కష్టాలు తీరాయి.