విశాఖ: కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

అగనంపూడి నుంచి స్టీల్ ప్లాంట్ దిశగా ప్రవహించే ఏలేరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం కాలువలో మృతదేహం ఉందని స్థానికుల ద్వారా సమాచారం అందడంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి ప్రాథమిక పరిశీలన చేపట్టారు. మృతుడు ఎవరు? ఎలా మృతి చెందాడు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్