విశాఖ నగర పర్యటనలో ఉన్న కేంద్ర పోర్టులు, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద్ సోనోవాల్‌ను సోమవారం విశాఖ పోర్ట్ ట్రస్ట్ సలహా మండలి కమిటీ మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించి, సింహాద్రి నాథుడు చందన ప్రసాదం అందజేశారు.సింహాచలం ఆలయ విశిష్టతను వివరించగా, మంత్రి ఆసక్తిగా ఆలయ విషయాలను తెలుసుకున్నారు.