న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతి నగరాలకు నూతన రైలు సర్వీసులను వెంటనే ప్రారంభించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, జిల్లాలోని పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్ర మంత్రి నుండి సానుకూల హామీని పొందారు. ఈ భేటీ ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధికి కీలకమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.