అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆగస్టులో "పల్లెకి పోదాం చలో చలో" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ముఖ్యంగా బడిన బాగు చేయడం, గుడిలో గంట పెట్టడం, ఊరు ప్రారంభంలో జండా దిమ్మ కట్టడం, పాల కేంద్రంలో బెంచీలు ఏర్పాటు, స్మశానంలో కుళాయి ఏర్పాటు, పంచాయతీ కార్యాలయంలో టీవీ ఏర్పాట, యువత కోసం గ్రంథాలయంలో బీరువాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలనీ ఆదేశించారు.