విశాఖ: మోంథా తుపానుతో పెరిగిన ముడ‌స‌ర్లోవ నీటి మట్టం

విశాఖ‌లోని ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మోంథా తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా ఈ రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. శుక్రవారం ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రిజర్వాయర్‌లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరింది. తుపానుకు ముందు రిజర్వాయర్‌లో 157.5 అడుగుల నీరు ఉండగా, వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6 అడుగులకు చేరింది.

సంబంధిత పోస్ట్