భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని విశాఖ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం( సిఐటియు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం జగదాంబ దరినున్న సిఐటియు కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్ మాట్లాడుతూఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.