విశాఖ: మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరాధారం: వేపాడ

శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ, మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని అన్నారు. కూటమి ప్రభుత్వం 15,941 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందని, కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో పేపర్ లీకేజీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్