ఆదివారం వైజాగ్‌లోని విఎంఆర్‌డిఎ చిల్డ్రన్స్ ఎరీనాలో ‘వైజాగ్ మీడియా అవార్డ్స్’, ‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ‘ప్రతిభకు ప్రోత్సాహం-2026’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 35 మంది స్వదేశీ, విదేశీ కళాకారులకు 'కళాజీవ పురస్కారాలు', 60 మందికి 'ఉత్తమ పాత్రికేయ అవార్డులు' అందజేశారు. అలాగే 150 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు. జీవీఎల్ నరసింహారావు, విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, గంట్ల శ్రీను బాబు, ఆర్. నాగరాజు పట్నాయక్ ఈ వేడుకలో పాల్గొన్నారు.