విశాఖ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె. కె. రాజు బృందం సిరిపురంలోని పెట్రోల్ బంకుల్లో పరిశీలించింది. వాహనదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, తిప్పల దేవన్ రెడ్డి, కోలా గురువులు, కటుమూరి సతీష్‌తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కొరత ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.