గాజువాకలోని మోహిని థియేటర్ వద్ద ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా మెగాస్టార్ అభిమానులు భారీ హంగామా చేశారు. ‘మెగాస్టార్ యువసైన్యం’ ఆధ్వర్యంలో థియేటర్ వద్ద భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, ప్రీమియర్ షోను ఘనంగా ప్రారంభించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోలాటాలు, డ్యాన్స్‌లు, మెగాస్టార్ నినాదాలతో థియేటర్ పరిసరాలను హోరెత్తించారు.