గాజువాక సమీపంలో ఉన్న దువ్వాడ రైల్వే బ్రిడ్జి పక్కన ఓ వ్యక్తి గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని బిక్షగాడు మనోజ్‌గా గుర్తించారు. అతని వయసు 50 ఏళ్లు మించి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.