విశాఖలో ప్రముఖ కంపెనీ చీఫ్ ఇంజనీర్ ఆత్మహత్య..?

విశాఖ నగరంలో ఒక ప్రముఖ కంపెనీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ బుధవారం ఉదయం అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. గాజువాకకు చెందిన ఆయన ఉదయం 6 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. వెళ్లేముందు రాసిన లేఖలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొనడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రత్యేక బృందాలతో హర్షవర్ధన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్