గాజువాక బీసీ గేటు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే బైక్‌పై నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు సమీపంలోని పెట్రోల్ బంకు నుంచి సేఫ్టీ పరికరాలు తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో బైక్ సగానికి పైగా కాలిపోయింది.