గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతలపూడి వెంకటరామయ్య, ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కరణం ధర్మశ్రీ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై. ఎస్. జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య జగన్‌కు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పార్టీ పరిస్థితిని జగన్ వారిద్దరినీ అడిగి తెలుసుకున్నారు.