గాజువాక: సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద విద్యార్థిని

విశాఖ జిల్లా గాజువాకకు చెందిన రేకా సాయిలక్ష్మి అనే యువతి అత్యంత పేదరికంలోనూ పట్టుదలతో చదువుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నాతయ్యపాలెంలోని రైల్వే ట్రాక్ పక్కన ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నప్పటికీ, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. యూపీఎస్సీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ చదువుల తల్లి, కోచింగ్ ఇతర ఖర్చుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆమె తండ్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ, కుటుంబానికి ఆర్థికంగా ఎటువంటి చేయూత అందలేదు.

సంబంధిత పోస్ట్