గాజువాకలో ప్రియురాలు మౌనిక హత్య కేసులో నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాజువాక పోలీసులు కోర్టును ఆశ్రయించగా, నిందితుడికి మూడు రోజుల కస్టడీ మంజూరైంది. ఈ విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని లోతైన విషయాలను వెలికితీయనున్నట్లు సీఐ పార్థసారధి తెలిపారు.