గాజువాక: విద్యుత్ షాక్‌ తో బాలుడికి తీవ్ర గాయాలు

పాత గాజువాకలో ఓ బాలుడు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్న ఆకాష్‌(9) ఆదివారం సాయంత్రం ఇంటి మేడపై గాలిపటం ఎగురవేస్తుండగా, అది హైటెన్షన్ వైర్లలో చిక్కుకుంది. దానిని లాగేందుకు ప్రయత్నించగా ఆకాష్‌కు కరెంట్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన అతన్ని తల్లిదండ్రులు వెంటనే KGHకు తరలించారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్