గాజువాక: గ్యాస్ సిలిండర్లతో పరారైన డెలివరీ బాయ్ అరెస్ట్

కస్టమర్ల నుంచి ఓటీపీలు సేకరించి, సుమారు 30 గ్యాస్ సిలిండర్లతో పరారైన డెలివరీ బాయ్ అప్పారావును గాజువాక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మణికంఠ గ్యాస్ ఏజెన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వినియోగదారులతో చనువుగా ఉంటూ వారి నుంచి ఓటీపీలు తీసుకుని, సిలిండర్లను దారిమళ్లించినట్లు విచారణలో తేలిందని గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ పార్థసారథి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్