గాజువాక: 24 గంటల్లో దోపిడీ కేసు ఛేదించిన దువ్వాడ పోలీసులు

గాజువాకలోని కూర్మన్నపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ఒక వ్యక్తిపై దాడి, దోపిడీ కేసును దువ్వాడ క్రైమ్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ నెల 22న లంకలపాలేనికి చెందిన పరశురాంపై ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి, ఫోన్‌పే ద్వారా రూ. 20 వేలు దోచుకున్నారు. ఈ కేసులో గుర్రం మణికంఠ అలియాస్ సిల్క్, తూరంగి దుర్గ ప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరొక నిందితుడైన జువెనైల్‌ను హోమ్‌కు పంపారు. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని తుప్పల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్