కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఈడీ దాడులను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పరవాడలో రాస్తారోకో జరిగింది. సీపీఎం జిల్లా నాయకులు, దేశపాత్రునిపాలెం మాజీ ఉపసర్పంచ్ వి. వి. రమణ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ దాడులతో కమ్యూనిస్టులను భయపెట్టలేరని, నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటన గురువారం పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద జరిగింది.