గాజువాక: బదిలీ అయిన అగనంపూడి యుబిఐ అధికారులకు వీడ్కోలు

విశాఖపట్నం అగనంపూడి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గుడివాడ సుధారాణి (విజయవాడకు), అడ్వాన్స్ ఆఫీసర్ డి. రామలక్ష్మి (ఏలూరుకు) బదిలీ అయిన సందర్భంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు కలిసి వారికి దుశ్శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గుడివాడ సుధారాణి మాట్లాడుతూ, ఖాతాదారుల సహకారంతో బ్యాంకులో సుమారు రూ. 10 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, రూ. 120 కోట్ల టర్నోవర్‌తో శాఖ ప్రగతి పథంలో నడుస్తోందని చెప్తూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ ఇద్దరు అధికారులు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించారన్నారు.

సంబంధిత పోస్ట్