విశాఖ జీవీఎంసీ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం గాజువాక జోన్ 79వ వార్డులో ప్రశాంతినగర్, అగనపూడి, గొల్లలపాలెం బరియల్ గ్రౌండ్, వేపగుంట కె. ఎస్. ఎన్. నగర్ తదితర ప్రాంతాలలో రూ. 2. 90 కోట్లతో వీఆర్‌సీసీ కాలువలు, బీటీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.