వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, బాండ్ పేపర్లు, డీఎస్సీ భూతాన్ని కార్మికులు, పార్టీ శ్రేణులు రోడ్డుపై పెట్టి దగ్ధం చేశారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.