గాజువాకలోని షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న ఎల్ఐసి ఉద్యోగి శ్రీనివాసరావు ఇంటిలో ఆదివారం వేకువజామున భారీ దొంగతనం జరిగింది. మరో నెలరోజుల్లో కూతురి పెళ్లి కోసం ఇంట్లో ఉంచిన కేజీ బంగారం, మూడు కేజీలు వెండి, రూ.20 లక్షల నగదు, పెళ్లి చీరలు, వాచీలు చోరీకి గురయ్యాయి. సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.