సౌరశక్తి వినియోగంతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.కె. నాయుడు గృహ యజమానులకు సూచించారు. గాజువాక 72వ వార్డు శ్రీనగర్‌లో శనివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద ఇంటిపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు, రాయితీలు లభిస్తాయని చెప్పారు.