గాజువాక: లారీ కింద పడి మహిళ దుర్మరణం

గాజువాక సమీపంలోని లంకెలపాలెం జంక్షన్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం రోడ్డు దాటుతున్న గుత్తుల శివపార్వతి అనే మహిళను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత కారణంగా శివపార్వతి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్