కేకే లైన్‌ను విశాఖలోనే కొనసాగించాలి.. సీపీఎం

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు స్వాగతించారు. అయితే, కొత్తవలస-కిరండూల్ (కేకే లైన్), అరకు, బొర్రా గుహల ప్రాంతాలను విశాఖ డివిజన్ నుండి విడదీసి రాయగడ డివిజన్‌లో కలపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గురువారం మద్దిలపాలెంలోని ఏచూరి భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేకే లైన్‌ను తరలించడం విశాఖ ప్రజలకు అన్యాయం చేయడమేనని, ఆ ప్రాంతాలను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్