నూతనంగా మంజూరైన 19 మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసినట్టు గాజువాకకు చెందిన 72 వ వార్డు కార్పొరేటర్ ఏ. జె. స్టాలిన్ తెలిపారు. శుక్రవారం గాజువాక ఆర్ఆర్ఆర్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ కొత్తగా 19 మందికి పెన్షన్లు మంజూరయ్యాయన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షులు ఏ. లక్ష్మణ్ రావు , కూటమి నాయకులు కరణం కనకా రావు , సిరస పల్లి నూక రాజు , సీపీఐ కార్యదర్శి జి. ఆనంద్ పాల్గొన్నారు.