ప్రముఖ గాయని ఎస్. జానకి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న విశాఖపట్నంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయనీమణులు గుదే అంబికా దేవి, మను పల్లాకు 'అభినవ జానకీ జీవన సాఫల్య పురస్కారాలు' అందజేయనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఎస్. జానకి స్వయంగా ఆవిష్కరించి, అవార్డు గ్రహీతలను అభినందించారు. 23న సాయంత్రం 6 గంటలకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో సంగీత విభావరితో పాటు ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు చెన్నా తిరుమలరావు తెలిపారు.