విశాఖ: వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు: ఘనంగా సంబరాలు

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన విశాఖ క్యాంపు కార్యాలయంలో గురువారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు కేక్ కట్ చేసి రాజన్న స్మృతులను నెమరువేసుకున్నారు. ఎంపీ తనుజారాణి మాట్లాడుతూ, ప్రజల కష్టాలనే మేనిఫెస్టోగా మార్చిన మహోన్నత నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి మాట్లాడుతూ, పాదయాత్ర ద్వారా పేదల సమస్యలను తెలుసుకున్న రాజన్న, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విప్లవాత్మక పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.

సంబంధిత పోస్ట్