విశాఖ డెయిరీ కార్మికుల ర్యాలీ

విశాఖ డెయిరీలో 300 మంది కార్మికులను తొలగించడంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. డెయిరీ యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికుల్లో 200 మంది మహిళలు ఉన్నారని, వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. గురువారం ఈమేరకు డెయిరీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్