ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న ఆధునీకరణ, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి కీలక సమస్యలను ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గ్రంథాలయాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.