విశాఖ‌: ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, డీఏలు అందక అప్పుల ఊబిలో కన్నీళ్లు పెడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, మే 31 లోపు ఉద్యోగులకు రావాల్సిన రూ. 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భోగాపురం విమానాశ్రయం వస్తున్నా, అంతర్జాతీయ గుర్తింపు పొందిన వైజాగ్ ఎయిర్‌పోర్టును ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని స్పష్టం చేశారు. అలాగే, చిత్తూరు జిల్లాలో హత్యకు గురైన జర్నలిస్టు కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.

సంబంధిత పోస్ట్