పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అనకాపల్లి జిల్లాలోని 20 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీ) ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణ, కిచెన్ గార్డెన్స్, కంపోస్ట్ పిట్లు, సోక్ పిట్లు మరియు వర్షపు నీటి సంరక్షణ ద్వారా 2027 జూలై నాటికి ఈ క్యాంపస్‌లను పూర్తిస్థాయిలో ‘నెట్ జీరో’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.