గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవో కె. శోభారాణి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాలపై చర్చించారు. దేవస్థానం ఏఈవో నక్క ఆనంద్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమానికి పల్లా శ్రీనివాసరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.