విశాఖలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్ చేయాలని నిరసన చేపట్టారు. డాబాగార్డెన్స్‌లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, డీఎస్సీలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.