విశాఖ: ద్వారకా బస్ స్టేషన్‌లో సంక్రాంతి రద్దీ పర్యవేక్షణ

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుండి 1600 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. గత ఏడాది కంటే ఈసారి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, రోజుకు సుమారు 1.50 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలకు అదనపు ట్రిప్పులు నడుపుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్