మేము సైతం అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎం.ఎం.ఎస్.ఎం విభాగం ఉద్యోగులు గిరి ప్రదక్షిణలో పాల్గొని భక్తులకు బిస్కెట్లు, చెక్కీలు వితరణ చేసి ఉదారత చాటుకున్నారు. బుధవారం అరిలోవ ప్రధాన రహదారిలో క్యూ వన్ హాస్పిటల్ సమీపంలో టెంటు వేసుకొని భక్తులకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా మా విభాగంలోని ఉద్యోగుల ఆర్థిక సహాయంతో గిరి ప్రదక్షిణ భక్తులకు పంపిణీ చేయడం జరుగుతున్నదని వెల్లడించారు.