విశాఖ: రైల్వే జోన్ ప్రారంభం తెలుగు ప్రజల విజయమే: పల్లా

తెలుగు ప్రజల దశాబ్దాల కల సాకారమైందని, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎదురుచూస్తున్న ప్రధాన హామీల్లో రైల్వే జోన్ ఒకటని, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో ప్రారంభమవుతున్న ఈ జోన్ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుందని తెలిపారు. దశాబ్దాల పోరాటం ఫలితంగానే ఈ జోన్ ఆవిర్భవించిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్