కంచరపాలెం రైతుబజార్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. రైతు బజార్‌లో భారీ వృక్షానికి జింక ఆకారంలో పెయింట్ వేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వృక్షం జింకను తలపించడంతో అక్కడకు వచ్చే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.