జీవీఎంసీ 4వ వార్డు నేరెళ్లవలసకు చెందిన నంది కృష్ణ, ఆరేళ్ల క్రితం తన మేనమామ కుమార్తె గౌతమిని వివాహం చేసుకున్నాడు. కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన, భార్యతో మనస్పర్ధల వల్ల మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవల పెద్దల జోక్యంతో మళ్లీ కలిశారు. అయితే బుధవారం అర్ధరాత్రి జరిగిన గొడవలో భార్య వేడి నీళ్లు పోయడంతో గాయపడ్డ కృష్ణను కేజీహెచ్ కి తరలించారు.