విశాఖ: రోడ్డు ప్రమాదంలో యువ ఇంజనీర్ మృతి

గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. సెనర్జీ సస్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాహుల్.. బుధవారం రాత్రి విధులు నిర్వహించుకుని బైక్ పై ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో గొయ్యిని తప్పించబోయి, వెనుక వస్తున్న లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్